logo

పాఠశాల విద్యకు ముప్పు

ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, 3, 4, 5 తరగతులను విలీనం చేయడం, 1, 2 తరగతులను అంగన్‌వాడీ కేంద్రంలో కలపడం ద్వారా భవిష్యత్తులో పాఠశాల విద్య కనుమరుగయ్యే అవకాశముందని డీటీఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యుడు రత్నం

Published : 10 Aug 2022 01:49 IST

మాట్లాడుతున్న డీటీఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యుడు రత్నం ఏసేపు

కర్నూలు (వెంకటరమణ కాలనీ), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, 3, 4, 5 తరగతులను విలీనం చేయడం, 1, 2 తరగతులను అంగన్‌వాడీ కేంద్రంలో కలపడం ద్వారా భవిష్యత్తులో పాఠశాల విద్య కనుమరుగయ్యే అవకాశముందని డీటీఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యుడు రత్నం ఏసేపు పేర్కొన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో ‘జాతీయ విద్యావిధానం..విద్యారంగంలో మార్పులు’ అంశంపై మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంతో విద్యారంగంలో రాష్ట్రాల సర్వ హక్కులను కేంద్రం లాగేసుకుంటోందని ఆరోపించారు. తరగతుల విలీనాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.   ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములుగౌడ్‌, సోమన్న, శరత్‌కుమార్‌, మధు, రంగముని, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని