logo

హత్య కేసులో నిందితుల అరెస్టు

కోవెలకుంట్ల సర్కిల్‌ పరిధిలోని సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఈ నెల 6న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ డీవీ నారాయణరెడ్డి మంగళవారం సర్కిల్‌ కార్యాలయంలో వెల్లడించారు. హత్యకు గురైన దైవపుత్రుడు (42)కు దాయాదైన పెరుమాళ్ల చిన్న రాజన్న

Published : 10 Aug 2022 01:49 IST

వివరాలు వెల్లడిస్తున్న సీఐ డీవీ నారాయణరెడ్డి

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్ల సర్కిల్‌ పరిధిలోని సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఈ నెల 6న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ డీవీ నారాయణరెడ్డి మంగళవారం సర్కిల్‌ కార్యాలయంలో వెల్లడించారు. హత్యకు గురైన దైవపుత్రుడు (42)కు దాయాదైన పెరుమాళ్ల చిన్న రాజన్న కుటుంబానికి ఇంటి దగ్గర సరిహద్దు గోడ విషయంలో తరచూ గొడవ జరిగేది. 6వ తేదీన దైవపుత్రుడు ఆటోలో ఇంటికి వస్తుండగా పెరుమాళ్ల చిన్న రాజన్న, భార్య సంజమ్మ, కుమారుడు రాజేష్‌, కూతురు ఐశ్వర్య, బావమరిది సొగసొట్ట ఓబులేసు, బావమరిది భార్య మేరీ, అదే గ్రామానికి చెందిన సమాధానమ్మ అతడిని అడ్డగించి గొడవ పడ్డారు. ఈ గొడవలో ట్రాక్టర్‌లో ఉన్న జాకీ రాడ్డు తీసుకొని దైవపుత్రుడిపై దాడి చేసి హత్య చేశారు. ఇదే గొడవలోనే ఆయన భార్య అరుణకుమారి, కొడుకులు వంశీ, శ్యామ్‌సన్‌, చెల్లెలు జయమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతుడి అన్న ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేశామన్నారు. హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్‌ ఇంజిన్‌, జాకీ రాడ్డు, రోకలి బండ, కర్రలను స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించామని సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని