logo

కలుపు పనుల్లో జీవితం మలుపు

తుగ్గలి మండలం జి.ఎర్రగుడి పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న అదే గ్రామ రైతు కుటుంబానికి వజ్రం రూపంలో అదృష్టం వరించింది.

Updated : 11 Aug 2022 05:01 IST

కాంతులీనుతున్న వజ్రపు రాయి

తుగ్గలి మండలం జి.ఎర్రగుడి పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న అదే గ్రామ రైతు కుటుంబానికి వజ్రం రూపంలో అదృష్టం వరించింది. టమాటా తోటలో బుధవారం కలుపు తీస్తుండగా రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువున్న, విలువైన వజ్రం లభించింది. దాన్ని పెరవలి, జొన్నగిరి వ్యాపారులు కలిసి రూ.34 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదే మండలంలోని జొన్నగిరిలో ఓ వ్యవసాయ కూలీ కలుపు పనులు చేస్తుండగా వజ్రం లభించింది. దాన్ని జొన్నగిరికి చెందిన వ్యాపారి రూ.6 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. జొన్నగిరి, పగిడిరాయి పొలాల్లో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనం ముమ్మరంగా వజ్రాన్వేషణ చేస్తున్నారు. ఏటా వర్షాలకు జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి పొలాల్లో వజ్రాలు లభించడం సర్వసాధారణమైంది.

- న్యూస్‌టుడే, తుగ్గలి

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts