logo

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

న్యూస్‌టుడే: వెల్దుర్తి మండలంలోని బొయినపల్లి గ్రామంలో సూరన్న(41) అనే రైతు అప్పుల బాధతో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.

Published : 12 Aug 2022 02:58 IST

సూరన్న (పాతచిత్రం)

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తి మండలంలోని బొయినపల్లి గ్రామంలో సూరన్న(41) అనే రైతు అప్పుల బాధతో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సూరన్న ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన 8 ఎకరాల పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. గత ఏడాదిలో సాగుచేసిన పత్తి, మిరప, ఆముదం పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. వీటితో పాటు ఈ ఏడాది సైతం పత్తి సాగుచేశాడు. వర్షాలతో పొలంలో కలుపు మొక్కలు పెరిగి బీడుగా మారింది. పొలానికి పెట్టుబడి పెట్టలేకపోయాడు. వీటితో పాటు వ్యవసాయ సాగు, కుటుంబ అవసరాల కోసం రూ.8లక్షలు అప్పులు చేశాడు. అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనప్తాపానికి గురైన ఇతను పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. సూరన్నకు భార్య సాలమ్మ, కుమారుడు రాము, కుమార్తెలు శివరామేశ్వరి, ప్రవళ్లిక ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని