logo

పప్పుగుత్తితో తల్లిని చంపిన కుమారుడు

మండలంలోని ఎరిగేరి గ్రామానికి చెందిన బోయ హనుమంతమ్మ, లోహితయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందరికి పెళ్లిళ్లు చేశారు. దంపతులిద్దరూ తమకున్న మూడెకరాలు సాగు చేసుకుంటూ

Published : 12 Aug 2022 02:58 IST

కౌతాళం, న్యూస్‌టుడే: మండలంలోని ఎరిగేరి గ్రామానికి చెందిన బోయ హనుమంతమ్మ, లోహితయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందరికి పెళ్లిళ్లు చేశారు. దంపతులిద్దరూ తమకున్న మూడెకరాలు సాగు చేసుకుంటూ కుమారుడి వద్దనే ఉంటున్నారు. ఆస్తిని అందరికీ సమానంగా పంచాలని తల్లి చెబుతుండేవారు. ఆస్తిని ఆడపిల్లలకూ పంచుతారేమోనన్న అనుమానంతో తల్లి హనుమంతమ్మపై గురువారం పప్పు గుత్తితో దాడిచేశాడు. వెంటనే కుటుంబీకులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త లోహితయ్య ఫిర్యాదు మేరకు కుమారుడు లింగన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేంద్రకుమార్‌ రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని