logo

అగస్టీన్‌..సైకిల్‌ యాత్ర

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: పేరు అగస్టీన్‌.. కర్ణాటకలోని రాయచూరు జిల్లా హనుమాపురం స్వగ్రామం. తల్లిదండ్రులు చనిపోయారు. కొంత కాలం ఇతడు పెయింటర్‌గా ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు

Published : 12 Aug 2022 02:58 IST

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: పేరు అగస్టీన్‌.. కర్ణాటకలోని రాయచూరు జిల్లా హనుమాపురం స్వగ్రామం. తల్లిదండ్రులు చనిపోయారు. కొంత కాలం ఇతడు పెయింటర్‌గా ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకున్నారు. దేశంపై భక్తి, ప్రేమతో ఇలా పదేళ్లుగా జాతీయ జెండాలతో వివిధ రాష్ట్రాల్లో సైకిల్‌ యాత్ర చేస్తున్నారు. యాత్రలో ఎవరైనా.. ఏదైనా ఆహారం పెడితే తింటూ.. ఎక్కడా చీకటి పడితే అక్కడే కునుకు తీస్తుంటారు. ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాలన్నీ చుట్టివచ్చానంటున్నారు అగస్టీన్‌. గురువారం ఆదోనిలో కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని