logo

రాఘవేంద్రా.. సింహ వాహనాధీశా

మంత్రాలయంలో పూర్వారాధన శుక్రవారం నయనానందకరంగా సాగింది. స్వామి వారు ప్రహ్లాదరాయల రూపంలో వేద మంత్రోచ్ఛరణ, సంప్రదాయ వాయిద్యాల మధ్య సింహ వాహనంపై కొలువుదీరి శ్రీమఠంలో ఊరేగగా.. భక్తులు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో పూర్వారాధనలో

Published : 13 Aug 2022 00:39 IST

కనుల పండువగా పూర్వారాధన

బంగారు పల్లకి ఊరేగింపు

మంత్రాలయం, న్యూస్‌టుడే: మంత్రాలయంలో పూర్వారాధన శుక్రవారం నయనానందకరంగా సాగింది. స్వామి వారు ప్రహ్లాదరాయల రూపంలో వేద మంత్రోచ్ఛరణ, సంప్రదాయ వాయిద్యాల మధ్య సింహ వాహనంపై కొలువుదీరి శ్రీమఠంలో ఊరేగగా.. భక్తులు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో పూర్వారాధనలో భాగంగా గ్రామ దేవత మంచాలమ్మ, ప్రహ్లాదరాయలు, రాఘవేంద్రస్వామి మూల బృందావనం, పూర్వ పీఠాధిపతుల బృందావనాలకు సంస్థాన పూజలు చేశారు. బంగారు మండపంలో మూలరాములు, దిగ్విజయరాములు, జయరాములు, సంతాన గోపాలకృష్ణ, వైకుంఠవాసు దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మూలరాముల దర్శనం కల్పించారు. అనంతరం రాత్రి పుష్ప, పట్టు వస్త్రాలతో అలంకృతుడైన ప్రహ్లాదుడు రాత్రి సింహ వాహనం, వెండి, బంగారు, నవరత్న రథాలపై ఊరేగారు. శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ అధికారులు స్వామికి పట్టు వస్త్రాలు, ప్రసాదాలు తెచ్చారు. మఠం అధికారులు వారికి ఘన స్వాగతం పలికి ఊరేగింపుగా తెచ్చిన వస్త్రాలను రాఘవేంద్రస్వామి బృందావనానికి సమర్పించారు.

నేడు మధ్యారాధన.. తితిదే పట్టు వస్త్రాల రాక

సప్త రాత్రోత్సవాల్లో ప్రధానమైన మధ్యారాధనోత్సవం శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామికి వేయి లీటర్ల పాలాభిషేకం, ఫల పంచామృతాభిషేకం, అలంకరణ, ఉదయం రథోత్సవం నిర్వహిస్తారు. తిరుమల,  తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు రానున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని