logo

ఉప్పొంగుతున్న తుంగభద్ర

తుంగభద్ర నదికి వరద ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం 1.67 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతోంది. సుంకేసుల జలాశయం ద్వారా 1.65 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి, మరో రెండు వేల క్యూసెక్కులు కేసీ కాలువకు వదులుతున్నారు. మంత్రాలయం వద్ద ఫోర్‌కాస్ట్‌ (నీటి ప్రవాహం) హెచ్చరిక స్థాయి

Updated : 13 Aug 2022 07:03 IST

శ్రీశైలానికి భారీ వరద

కందకూరులో వరద నీటిలో పొలాలు, మోటార్లు

ఈనాడు - కర్నూలు: తుంగభద్ర నదికి వరద ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం 1.67 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతోంది. సుంకేసుల జలాశయం ద్వారా 1.65 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి, మరో రెండు వేల క్యూసెక్కులు కేసీ కాలువకు వదులుతున్నారు. మంత్రాలయం వద్ద ఫోర్‌కాస్ట్‌ (నీటి ప్రవాహం) హెచ్చరిక స్థాయి 310, డేంజర్‌ లెవల్‌ 312 కాగా.. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 310.50 మేర కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

వినిపించని ముందస్తు హెచ్చరికలు

* తుంగభద్రలో గురువారం 1.70 లక్షలు, శుక్రవారం 1.67 లక్షలు వరద రావడంతో నదీ తీరంలో పొలాలు ఇప్పటికే నీట మునిగాయి. ముందస్తుగా స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లోకి వరద నీరు రావడంతోపాటు మోటార్లు మునిగాయి. కొన్నిచోట్ల పైపులు కొట్టుకు పోయాయి.

* ఉమ్మడి జిల్లాలో ఆగస్టు 1 నుంచి 12 వరకు కురిసిన భారీ వర్షాలు, తుంగభద్ర వరద నీటితో ముంపు గురైన పొలాలు 3,289 ఎకరాలున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. 1980 ఎకరాల్లో పత్తి, 685 ఎకరాల్లో మొక్కజొన్న, 680 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి.

రెండు మండలాల్లో తీవ్ర నష్టం

తుంగభద్ర నదికి ఐదు రోజులుగా వరద పోటెత్తుతుండటంతో కౌతాళం, కోసిగి మండలాల పరిధిలో వరి, పత్తి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. కోసిగి పరిధిలో తుమ్మిగేనురు, అగసనూరు, సాతనూరు, బొమ్మలాపురం, కడదొడ్డి, కందుకూరు గ్రామాల్లో సుమారు 723 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయాధికారి రాజు తెలిపారు. కందుకూరు గ్రామ లక్ష్మీ క్యాంప్‌ సమీపంలోని పొలాల్లో సుమారు వంద మోటార్లు నీట మునిగాయి. అదేవిధంగా కౌతాళం పరిధిలో 800 ఎకరాల పంటలతోపాటు 60 మోటార్లు వరద నీటిలో మునిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని