logo

తరగతుల విలీన ప్రక్రియ ఆపాలి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ నాయకులు కోరారు.  శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం నేత భాస్కర్‌ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వ నిర్ణయాలతో

Published : 13 Aug 2022 00:39 IST

నిరసన తెలుపుతున్న పీడీఎస్‌యూ నాయకులు

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ నాయకులు కోరారు.  శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం నేత భాస్కర్‌ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిస్థితి ఉద్రిక్తం

పీడీఎస్‌యూ నాయకులు పెద్దఎత్తున కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో వారు కలెక్టరేట్‌ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని