logo

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు

రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని భాజపా నాయకులు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర నిర్వహించారు. కర్నూలు నగరం కల్లూరు చెన్నమ్మ కూడలిలో శుక్రవారం రాత్రి యాత్ర ముగింపు సభ ఏర్పాటు చేశారు.

Published : 13 Aug 2022 00:39 IST

త్వరలో కర్నూలులో సర్వజనుల సమ్మేళనం

యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో భాజపా నేతలు

శాంతి కపోతాలు ఎగురవేస్తున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌, నాయకులు ఆదినారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, పార్థసారథి తదితరులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని భాజపా నాయకులు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర నిర్వహించారు. కర్నూలు నగరం కల్లూరు చెన్నమ్మ కూడలిలో శుక్రవారం రాత్రి యాత్ర ముగింపు సభ ఏర్పాటు చేశారు. ముందుగా కర్నూలు నగరంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇస్తుండగా ఈ నిధులను ముఖ్యమంత్రి స్వాహా చేస్తున్నారని ధ్వజమెత్తారు. భాజపా రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా విడిపోవడానికి చంద్రబాబు, వైఎస్‌ జగనే కారణమని ఆరోపించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ మహానుభావుడని అన్నారు. రాష్ట్ర ప్రగతి నిరోధకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కుల రాజకీయాలతో రాష్ట్రంలో ప్రగతి కుంటుపడిందని చెప్పారు. వైకాపా ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రి చుట్టూ ఉండేవారికి ఏ విషయంపైనా అవగాహన లేదన్నారు. నంద్యాలలో జరిగిన కానిస్టేబుల్‌ హత్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తోందని ధ్వజమెత్తారు. త్వరలో కర్నూలులో సర్వజన సమ్మేళనం ఏర్పాటు చేసి అందరిని ఒకేతాటిపైకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు. అందరం కలిసి పనిచేస్తే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.

అన్ని పార్టీలను ఏకం చేస్తాం

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని, మహిళలకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా కలసికట్టుగా ముఖ్యమంత్రిని గద్దె దింపాలన్నారు. అవసరమైతే అన్ని పార్టీలను ఏకం చేసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ మాట్లాడుతూ దేశం, దేశ ప్రజలు ముఖ్యమని భావించే పార్టీ భాజపా అని అన్నారు. భాజపా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ చాహల్‌, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, చంద్రమౌళి, శ్రీనివాస్‌, పార్థసారథి, రమేష్‌నాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని