logo

రాఘవ ప్రభా.. ఆధ్యాత్మిక శోభ

మంత్రాలయంలోని రాఘవుడి మఠానికి జనం పోటెత్తారు. ఆరాధనోత్సవాలు తిలకించేందుకు బారులుదీరారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి వెయ్యి లీటర్లతో పాలాభిషేకం, ఫల పంచామృతాభిషేకం, మంగళహారతి ఇచ్చారు.

Published : 14 Aug 2022 01:08 IST

ఆరాధనోత్సవాలకు పోటెత్తిన భక్తులు

నేడు మహారథోత్సవ వైభవం

బంగారు హారాన్ని చూపిస్తున్న పీఠాధిపతి

మంత్రాలయం, న్యూస్‌టుడే: మంత్రాలయంలోని రాఘవుడి మఠానికి జనం పోటెత్తారు. ఆరాధనోత్సవాలు తిలకించేందుకు బారులుదీరారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి వెయ్యి లీటర్లతో పాలాభిషేకం, ఫల పంచామృతాభిషేకం, మంగళహారతి ఇచ్చారు. డిప్యూటీ ఈవో రమేశ్‌ బాబు తితిదే తరఫున పట్టువస్త్రాలు, ప్రసాదాలు తీసుకొచ్చారు. వారికి మఠం మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు, పీఆర్వో ఐపీ నరసింహమూర్తి, శ్రీపతిచార్‌లు ఘన స్వాగతం పలికారు. బెంగళూరుకు చెందిన ఎంఎస్‌ఆర్‌ పట్టాభిరాం, అనిత దంపతులు రూ.1.50 కోట్ల విలువైన బంగారు హారాన్ని సమర్పించినట్లు పీఠాధిపతి తెలిపారు. భక్తుల పాదకానుకల ద్వారా వచ్చిన సొమ్ముతో నవ వైఢూర్యాలు, వజ్రాలతో చేసిన హారాలు, 350 కిలోల వెండితో చేసిన మండపం, నవరత్నాలతో పొదిగిన బంగారు కవచాన్ని సమర్పించినట్లు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ రాధాకృష్ణ కృపాసాగర్‌ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం మఠం వీధుల్లో ప్రహ్లాదరాయలను పుష్పమంటప వాహనంపై ఊరేగించారు. అనంతరం వెండి, బంగారు, నవరత్న రథాలపై ఒకదానివెంట ఒకటి తీసుకొచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్తరారాధనోత్సవం నిర్వహించనున్నారు. వసంతోత్సవం అనంతరం స్వామివారు మహారథంపై కొలువుదీరి గ్రామ పురవీధుల్లో ఊరేగనున్నారు. హెలికాఫ్టర్‌ ద్వారా పూలు చల్లేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని