logo

ఇద్దరి ఆత్మహత్య

రుద్రవరానికి చెందిన నవీన్‌ (23) అనే యువకుడు రసాయనిక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. నవీన్‌ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విష రసాయనం తాగాడన్నారు.  ఇది గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా

Published : 14 Aug 2022 01:08 IST

రుద్రవరం, న్యూస్‌టుడే: రుద్రవరానికి చెందిన నవీన్‌ (23) అనే యువకుడు రసాయనిక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. నవీన్‌ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విష రసాయనం తాగాడన్నారు.  ఇది గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

సంజామల, న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెడ్డిపల్లెకు చెందిన కుప్పు వెంకటేశ్వరరెడ్డి(51) భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందారు, ఆయనకు కుమారుడు, కుమార్తె ఉండగా వారికి వివాహం చేశారు. కుమారుడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వెంకటేశ్వరరెడ్డి అన్నదమ్ముల వద్ద ఉండి జీవిస్తున్నారు. అనారోగ్య సమస్యలు వెంటాడటంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 12న పురుగు మందు తాగారు. వెంటనే కుటుంబ సభ్యులు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిమ్మారెడ్డి పేర్కొన్నారు.


ఫోర్జరీ సంతకంతో రిజిస్ట్రేషన్‌

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి పట్టణంలోని సర్వే నంబరు 147-2బీ1లో గ్రామ కంఠం భూమిని కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి ఎన్‌ఓసీ తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకన్న 18 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంకర్‌నాయక్‌ శనివారం తెలిపారు. ఒక్కొక్కరు 3 నుంచి 5 సెంట్లు మొత్తం 29 సెంట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.  గ్రామ కార్యదర్శి ఖలీల్‌ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని