logo

మనోరథంపై రాఘవుడు

రాఘవేంద్రస్వామి మహా రథోత్సవం రమణీయంగా సాగింది. వేలాదిగా తరలొచ్చిన భక్తులతో మంత్రాలయ క్షేత్రం కిక్కిరిసింది. పీఠాధిపతి రథం పైనుంచి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉద్యమకారులు,

Published : 15 Aug 2022 02:02 IST

తిలకించేందుకు తరలొచ్చిన భక్తజనం

అశేషజనం మధ్య రథోత్సవం

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్రస్వామి మహా రథోత్సవం రమణీయంగా సాగింది. వేలాదిగా తరలొచ్చిన భక్తులతో మంత్రాలయ క్షేత్రం కిక్కిరిసింది. పీఠాధిపతి రథం పైనుంచి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉద్యమకారులు, సరిహద్దుల్లో దేశ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న సైన్యానికి అభినందనలు తెలిపారు. దాతల సహకారం, పాదకానుకల ద్వారా మఠంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. రేషన్‌ కార్డు కలిగిన భక్తులకు ఉచితంగా వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లుగా ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్నవారిని ఒప్పంద కార్మికులుగా గుర్తిస్తామన్నారు. శాశ్వత ఉద్యోగులకు 6.8 డీఏను పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి రూ.2 వేల చొప్పున వేతనం పెరగనుందన్నారు. సాయంత్రం యోగీంద్ర వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నంజనగూడకి చెందిన విదూషి శ్రీమతి రేఖాభట్‌ దాసవాణి, హుబ్లీకి చెందిన పండిట్‌ వెంకటేశ్‌కుమార్‌ హిందూస్తానీ గాత్రం, ఉడిపికి చెందిన భార్గవి నృత్య టండన్‌ బృందం భరతనాట్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
* ఉత్సవాల్లో భాగంగా నేడు సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన నిర్వహించనున్నారు. సాయంత్రం మఠం ప్రాకారంలో ఉత్సవమూర్తి ఊరేగింపు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మఠం అధికారులు రాజ గిరియాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్‌జ్యోషి, పీఆర్వో ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్‌, డీఈ భద్రినాథ్‌, బిందుమాధవ్‌, వ్యాసరాజచార్‌, దత్తు, ద్వారపాలక అనంతస్వామి, సీఆర్వోలు క్యాషియర్‌ రవి, విజ్జిస్వామి పాల్గొన్నారు.
* మహా రథోత్సవంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు పన్నగస్వామి, జిల్లా యువత కార్యదర్శి దివాకర్‌రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి వై.ప్రదీప్‌రెడ్డి, మండల ఇన్‌ఛార్జి విశ్వనాథ్‌రెడ్డి, మంత్రాలయం సర్పంచి భీమయ్య, తెదేపా నాయకులు విజయ్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ భాస్కర్‌, ఎస్సై వేణుగోపాల్‌రాజు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంప్రదాయ వాయిద్యాల ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని