logo

జల దృశ్యాన్ని చూసేందుకు పోటెత్తిన జనం

శ్రీశైలం జలాశయం జల దృశ్యాన్ని  చూసేందుకు ఆదివారం సందర్శకులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన పరిసరాలు కళకళలాడాయి. వరుస సెలవులు ఉండటం..

Published : 15 Aug 2022 02:02 IST

వ్యూ పాయింట్‌ వద్ద సందర్శకుల సందడి

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే : శ్రీశైలం జలాశయం జల దృశ్యాన్ని  చూసేందుకు ఆదివారం సందర్శకులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన పరిసరాలు కళకళలాడాయి. వరుస సెలవులు ఉండటం.. పది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో ఈ జల దృశ్యాన్ని చూసేందుకు పిల్లలతో కలిసి వస్తున్నారు. పెద్ద వంతెన నుంచి శ్రీశైలం వరకు రహదారిపై వాహనాలు బారులుతీరాయి. ఉదయం నుంచి రద్దీ కొనసాగింది. ఆనకట్టకు సమీపంలో రహదారులకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌క్కు అంతరాయం ఏర్పడింది. వ్యూ పాయింట్‌ వద్ద సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపారు. లింగాలగట్టు ప్రాంతంలో చేపలను కొనుగోలు చేసేందుకు పలువురు రహదారిపై వాహనాలు నిలపడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఆనకట్ట సమీపంలో ట్రాఫిక్‌క్కు అంతరాయం లేకుండా 15 మంది పోలీసులు, ఇద్దరు ఎస్సైలు విధులు నిర్వహిస్తున్నట్లు రెండో పట్టణ ఎస్సై నవీన్‌బాబు  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని