logo
Published : 15 Aug 2022 02:02 IST

ప్రగతి పునాదులు

నాటి శాసనసభ.. నేడు జిల్లా కోర్టు

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : చరిత్ర పుటల్లో కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కర్నూలే మొదటి రాజధాని. గవర్నర్‌ త్రివేదిగా ఉన్నారు. తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు, ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి, రాష్ట్ర మంత్రులుగా తెన్నేటి విశ్వనాథం, పట్టాభిరామారావు, కె.కోటిరెడ్డి, పి.తిమ్మారెడ్డి, సర్దార్‌ గౌతు లక్ష్మన్న, దామోదర సంజీవయ్య, స్పీకర్‌గా నల్లపాటి వెంకట్రామయ్య, డిప్యూటీ స్పీకర్‌గా పసల సూర్యచంద్రరావు, ముఖ్య కార్యదర్శిగా ఒ.పుల్లారెడ్డి వ్యవహరించారు. మొత్తం 144 మంది శాసనసభ్యులుండేవారు. అప్పట్లో ఎస్టీబీసీ కళాశాల ముఖ్యమంత్రి కార్యాలయంగా, జిల్లా కోర్టు భవనం శాసనసభగా ఉండేది. కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ విభాగ భవనం సచివాలయంగా.. టౌన్‌ మోడల్‌ పాఠశాల శాసనసభ్యుల నివాస గృహాలుగా ఉండేవి. 1956 ప్రాంతంలో కర్నూలు నుంచి హైదరాబాదుకు రాజధాని తరలిపోయింది. ఫలితంగా కర్నూలులోని ముఖ్య భవనాలన్నీ ప్రభుత్వ కార్యాలయాలుగా.. కళాశాలలుగా మారిపోయాయి. కేవలం గుర్తులు మాత్రమే మిగిలాయి.


నాటిసచివాలయం.. నేడు కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ విభాగం

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని