logo

భారీగా రేషన్‌ బియ్యం స్వాధీనం

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులు వేర్వేరు చోట్ల దాడులు జరిపి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.

Published : 15 Aug 2022 02:02 IST

పట్టుబడ్డ బియ్యం లారీతో విజిలెన్స్‌ అధికారులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులు వేర్వేరు చోట్ల దాడులు జరిపి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం వద్ద 610 బస్తాల రేషన్‌ బియ్యం (300.5 క్వింటాళ్లు)  లోడుతో ఉన్న లారీని ఆదివారం పట్టుకుని డ్రైవర్‌ నరసింహను అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలకు చెందిన లారీ యజమాని మల్లేశ్వరరెడ్డికి ఫోన్‌ చేయగా సెల్‌ స్విచ్ఛాప్‌  వచ్చింది. లక్ష్మీపురానికి చెందిన ఓ నాయకుడు అక్రమ రవాణాకు సూత్రధారిగా అనుమానిస్తున్నారు. బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపినట్లు అధికారులు చెప్పారు. బియ్యం లోడును ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అప్పగించి నిందితులను ఉల్లిందకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్సై కేసు నమోదు చేశారు.
* బ్రాహ్మణకొట్కూరు వద్ద రెండు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా 114 బస్తాల రేషన్‌ బియ్యం   (54.3 క్వింటాళ్లు) బయటపడింది. వీటిని నందికొట్కూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అప్పగించి మధు, సురేష్‌ అనే వ్యక్తులను నందికొట్కూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ దాడుల్లో సీఐ శ్రీధర్‌, ఏఏవో షణ్ముఖ గణేష్‌, ఎస్సై హనుమంతు, ఏజీ సిద్ధయ్య, ఎస్సై జయన్న, హెడ్‌ కానిస్టేబుల్‌ సూరి, కానిస్టేబుళ్లు భరత్‌, రామచంద్ర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని