logo

అభివృద్ధికి ఆద్యుడు కోట్ల

రాష్ట్ర అభివృద్ధికి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీఎస్‌బీసీయూ మాజీ ఛైర్మన్‌ పీజీ రాంపుల్లయ్య

Published : 17 Aug 2022 02:51 IST

కోట్ల విజయభాస్కర్‌రెడ్డి విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి, సోమిశెట్టి, తెదేపా నాయకులు, కార్యకర్తలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర అభివృద్ధికి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీఎస్‌బీసీయూ మాజీ ఛైర్మన్‌ పీజీ రాంపుల్లయ్య యాదవ్‌, కోడుమూరు తెదేపా బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌, జడ్పీ మాజీ ఛైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి తదితరులు అన్నారు. కోట్ల జయంతిని పురస్కరించుకుని కర్నూలు పాత కంట్రోల్‌ రూమ్‌ దగ్గర కోట్ల సర్కిల్‌లో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కిసాన్‌ఘాట్‌లో ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించారని, ప్రగతి పథంలో ఎన్నో మైలురాళ్లు సాధించి.. పల్లెపల్లెకు తాగు-సాగు నీరు అందించడమేకాక రోడ్లు, గృహాలు, విద్య, వైద్యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టారని, సారాను నిషేధించారని, డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేసి మహిళా సాధికారతకు కృషి చేశారని కొనియాడారు. కేసీ కాలువ, ఎల్‌ఎల్‌సీ ఆధునికీకరణకు రూ.వందల కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు.   ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీజీ గోపినాథ్‌ యాదవ్‌, కేడీసీసీ మాజీ డైరెక్టర్‌ పి.లోక్‌నాథ్‌ యాదవ్‌, కోట్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని