logo
Published : 17 Aug 2022 02:51 IST

సారా విక్రయదారులపై పీడీ యాక్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో ముగ్గురు సారా విక్రయదారులపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ప్రసాద్‌తో కలిసి మంగళవారం వివరాలు వెల్లడించారు. ఆదోనిలోని బసాపురానికి చెందిన ఎరుకల మునిస్వామి అలియాస్‌ ఎరుకలి మునిస్వామి, ఆదోని పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన బోయ దాసప్ప, మద్దికెర మండలం పెరవలికి చెందిన చిప్పగిరి గోవిందప్పపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి కడప సెంట్రల్‌ జైలు పంపామన్నారు. సారా వ్యాపారానికి అలవాటుపడిన ఎరుకలి మునిస్వామిపై 10 (ఇస్వీ పోలీసుస్టేషన్‌లో ఆరు,  ఆదోని సెబ్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు), బోయ దాసప్పపై ఆరు కేసులు, చిప్పగిరి గోవిందప్పపై ఆరు కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదోనికి చెందిన ఒలుమన్న, బోయ రంగన్న, కర్నూలుకు చెందిన కల్లికోట కృష్ణపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి కడప సెంట్రల్‌ జైలుకు పంపామని, వారు ఇప్పటికీ కారాగారంలోనే ఉన్నారన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నాటు సారాకు సంబంధించి 1,231 కేసులు నమోదు చేసి 1,287 మందిని అరెస్టు చేశామని, 12,803 లీటర్ల నాటు సారా సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. 21,406 కేజీల బెల్లం, 106 వాహనాలు సీజ్‌ చేసి 57 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు. అక్రమ మద్యం రవాణాకు సంబంధించి 1,072 కేసులు నమోదు చేసి 1,560 మందిని అరెస్టు చేశామని, 27,931 లీటర్ల మద్యంతోపాటు 322 వాహనాలు సీజ్‌ చేశామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే జిల్లా బహిష్కరణకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైండోవర్‌ ఉల్లంఘించిన 35 మంది నుంచి రూ.4.64 లక్షలు జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశామన్నారు. జప్తు చేసిన 42,165 లీటర్ల నాటుసారా, 7,95,833 లీటర్ల మద్యం ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. సారా ప్రభావిత ప్రాంతాలు 21 వరకు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృషి సారించామని, నిరంతరం దాడులు చేసే నిమిత్తం 12 బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని