logo

671 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులు మంగళవారం దాడులు చేసి 671 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. కోవెలకుంట్ల పరిధిలో అక్రమ రవాణా అవుతున్న 170 బస్తాల (95.8 క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం

Published : 17 Aug 2022 02:51 IST

పట్టుకున్న బియ్యం లారీతో విజిలెన్స్‌ అధికారులు

కర్నూలు నేరవిభాగం: ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులు మంగళవారం దాడులు చేసి 671 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. కోవెలకుంట్ల పరిధిలో అక్రమ రవాణా అవుతున్న 170 బస్తాల (95.8 క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం పట్టుకుని వాహన డ్రైవర్లు వెంకటరాజు, వెంకటసుబ్బయ్యను అరెస్టు చేసి కోవెలకుంట్ల పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. వాహనం యజమాని శివయ్య, రామసుబ్బారెడ్డి ఇందులో సూత్రధారులని తేలింది. కల్లూరు పరిధిలోని బుడగజంగాల కాలనీలో 501 బస్తాల రేషన్‌ బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. డోన్‌ మండలం కన్నప్పకుంటకు చెందిన డ్రైవర్‌ రాజశేఖర్‌, క్లీనర్‌ మహేంద్రతోపాటు  కల్లూరు ఎస్టేట్‌కు చెందిన కురువ లింగన్న, ఎరుకలి ఈరన్న, లారీ యజమాని.. ప్యాపిలి మండలం బోయపల్లికి చెందిన శ్రీరాములుతోపాటు లోడు లారీని కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. నిందితులు కర్ణాటకకు బియ్యాన్ని తరలించేందుకు పథకం రచించినట్లు విచారణలో తేలింది. బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. రెండు పోలీసుస్టేషన్లలో దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో సీఐలు నాగరాజయాదవ్‌, శ్రీధర్‌, ఏజీ సిద్ధయ్య, ఏవో రూపస్‌, ఎస్సైలు జయన్న, హనుమంతు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని