logo

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

చేసిన అప్పులు తీర్చలేననే బెంగతో మానసికంగా కుంగిపోయిన రైతు మద్దికెర తిరుపతయ్య(55) పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సి.బెళగల్‌ గ్రామానికి చెరందిన రైతు మద్దికెర తిరుపతయ్య తనకున్న

Published : 17 Aug 2022 02:51 IST

తిరుపతయ్య (పాత చిత్రం)

సి.బెళగల్‌, న్యూస్‌టుడే: చేసిన అప్పులు తీర్చలేననే బెంగతో మానసికంగా కుంగిపోయిన రైతు మద్దికెర తిరుపతయ్య(55) పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సి.బెళగల్‌ గ్రామానికి చెరందిన రైతు మద్దికెర తిరుపతయ్య తనకున్న మూడు ఎకరాల్లో ఉల్లి, పత్తి పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఓ బ్యాంకు నుంచి రూ.2 లక్షలు, ఇతరుల వద్ద రూ.3 లక్షలు పంటకోసం అప్పు చేశారు. దిగుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చలేనని మానసికంగా కుంగిపోయారు. సోమవారం ఉదయం పత్తికి తెగులు సోకడంతో పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లారు. అనంతరం సోదరుడు రాముడుకు ఫోన్‌ చేసి తాను పురుగు మందు తాగినట్లు చరవాణిలో చెప్పడంతో భార్య, కుమారులు వెళ్లి 108 వాహనంలో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి పది గంటలకు మృతిచెందారు. ఎన్నోసార్లు తనతో చెప్పి బాధపడగా ఓదార్చానని, చివరికి పొలంలో పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నారని భార్య లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమయ్యారు. లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్‌.శివాంజల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని