logo

పెద్దపులి మృతి ఘటనపై విచారణ

ఇటీవల పెద్దపులి మృతి చెందిన ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పరిశీలిస్తున్నట్లు అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం బైర్లూటి ఎకోటూరిజం, వైఎస్సార్‌ స్మృతివనాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.

Published : 17 Aug 2022 02:51 IST

నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

సిబ్బందితో చర్చిస్తున్న మధుసూదన్‌రెడ్డి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఇటీవల పెద్దపులి మృతి చెందిన ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పరిశీలిస్తున్నట్లు అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం బైర్లూటి ఎకోటూరిజం, వైఎస్సార్‌ స్మృతివనాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు, సిబ్బంది పులుల సంరక్షణపై అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సిబ్బంది కాకుండా బయట సిబ్బందిచేత ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి అడవిలో వెతుకుతున్నామన్నారు. ఉచ్చులు గమనించి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్‌డీపీటీ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌వో అలెన్‌చాన్‌ టెరాన్‌, ఇన్‌ఛార్జి రేంజర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని