logo
Published : 17 Aug 2022 02:51 IST

మెరిసిన పత్తి ధర

క్వింటాలు గరిష్ఠంగా రూ.11,909


ఆదోని మార్కెట్‌ యార్డులో పత్తి దిగుబడులు

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి ధరలు క్రమంగా ఉపందుకుంటున్నాయి. మంగళవారం క్వింటాలు గరిష్ఠం రూ.11,909, కనిష్ఠం రూ.5469, మధ్య ధర రూ.10,581 పలికింది. పరిశ్రమల్లో నిల్వలు లేకపోవడంతో గిరాకీ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. గత సీజన్లో సుమారు 15-20 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు సాగాయి. ఈ ఏడాది పత్తి విత్తు ఆలస్యం కావడం, పంట చేతికి రావడంలో నెల ఆలస్యమయ్యేలా ఉంది. సెప్టెంబరు వరకు పత్తి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో పత్తి కొరత కారణంగా డిమాండు ఏర్పడి, వ్యాపారుల మధ్య పోటీతో ధరల పెరుగుదల చోటుచేసుకుంటోంది. ధరలు సెప్టెంబరు వరకు నిలకడగా ఉండొచ్చని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అక్టోబరు నుంచి కొత్త పత్తి మార్కెట్లోకి వస్తుంది. దీంతో దిగుబడికి డిమాండు తగ్గి, ధరల్లో నిలకడ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో పత్తి ధరలు క్వింటాలు పది వేలు దాటడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts