logo

మంచినీటి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు

జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, తోగూరు ఆర్థర్‌, శ్రీదేవి, కలెక్టర్లు

Published : 17 Aug 2022 02:51 IST

జడ్పీ సమావేశంలో ఆర్థిక మంత్రి  
ఇద్దరు ఎంపీలు, పది మంది ఎమ్మెల్యేల గైర్హాజరు


మాట్లాడుతున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పక్కన జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి, కర్నూలు, నంద్యాల కలెక్టర్లు పి.కోటేశ్వరరావు, మనజీర్‌ జిలానీ సామూన్‌

డ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, తోగూరు ఆర్థర్‌, శ్రీదేవి, కలెక్టర్లు పి.కోటేశ్వరరావు, మనజీర్‌ జిలానీ సామూన్‌, వివిధ శాఖ అధికారులు హాజరయ్యారు. ఇద్దరు ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. వ్యవసాయ, ఉద్యాన, నీటి పారుదల, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్షించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జడ్పీ సమావేశంలో లేవనెత్తిన పెండింగ్‌ బిల్లుల అంశం ఏమైందని మంత్రి ఆరా తీశారు. రక్షిత నీటి పథకాలు పాతవి కావడంతో చిన్న చిన్న మరమ్మతులు చేసినా లాభం ఉండటం లేదని అధికారులు పేర్కొన్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు సమీక్షించి పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. మంచినీటి పథకాలు చాలా ముఖ్యమైనవి.. పనుల్లో నాణ్యత ఉండాలి.. నాణ్యతా పరిశీలన విభాగం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. నాణ్యత లేకపోతే గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని