logo

శైలపుత్రిగా భ్రమరాంబాదేవి

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తలు, అర్చకులు, వేదపండితులు పసుపు, కుంకుమ, పుష్పాలు భ్రమరాంబాదేవికి

Published : 27 Sep 2022 03:42 IST

ప్రారంభమైన దసరా మహోత్సవాలు

శైలపుత్రి అమ్మవారికి మంగళహారతులు ఇస్తున్న ప్రధానార్చకులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తలు, అర్చకులు, వేదపండితులు పసుపు, కుంకుమ, పుష్పాలు భ్రమరాంబాదేవికి సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, కంకణ పూజ, కంకణధారణ, పుణ్యాహవాచనం, అఖండ దీప స్థాపన తదితర ప్రారంభపూజలు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో నేత్రశోభితంగా అలంకరించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక వేదికపై భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో కొలువుదీరారు. అక్కమహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేసి పుష్పార్చనలు, మంగళ హారతులతో విశేష పూజలు జరిపారు. అనంతరం గ్రామోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలో జరిగిన కళారాధన కార్యక్రమంలో పలువురు కళాకారులు భక్తిగీతాలకు సంప్రదాయ నృత్యాలు చేశారు.

నేడు

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల రెండోరోజు మంగళవారం సాయంత్రం భ్రమరాంబాదేవి భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శ్రీస్వామి, అమ్మవార్లకు మయూర వాహన సేవ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని