logo

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు, జిల్లా అధికారులతో కలిసి బాధితుల నుంచి

Published : 27 Sep 2022 03:42 IST

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు, జిల్లా అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.

* నవంబరు ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం అమల్లోకి రానుందని, ఫ్లెక్సీలు ముద్రించినా, ఉపయోగించినా, రవాణా చేసినా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు హెచ్చరించారు.

బాధితుల విన్నపాలు

* కర్నూలు మండలం ఉల్చాలలో సర్వే నంబరు 858/1లో 3.20 ఎకరాలుండగా 2 ఎకరాలు ఆన్‌లైన్‌లో ఉంది.. మిగిలిన 1.20 ఎకరాలు ఇతరుల పేరున ఉంది.. సమగ్రంగా విచారించి న్యాయం చేయాలని బాధితుడు భూషన్న కలెక్టర్‌కు విన్నవించారు. భూ సమస్యలపై పలువురు ఫిర్యాదు చేశారు.

* ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు, రిఫ్రాక్షనిస్ట్‌ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాలలో మూడు పోస్టులు ఖాళీగా  చూపుతూ రూ.21 వేల వేతనం ప్రకటిస్తూ ప్రకటన ఇచ్చారు.. పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాకుండానే వేతనాన్ని రూ.37,500కు పెంచారు. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులు గడువు పెంచాలని ఏపీ నిరుద్యోగ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌ నాయకులు సుదర్శన్‌రావు, రామారావు తదితరులు కోరారు.

* కర్నూలు మండలం ఉల్చాల 1, 2 సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని,  గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మన్న, మల్లకల్‌ తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ ఎంపీపీ, ఆమె భర్త చెప్పినట్లు పనిచేస్తున్నారు.. అర్హులకు అందడం లేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని