logo

గాడితప్పిన డ్రైవింగ్‌ పాఠం

డ్రైవింగ్‌ నేర్పిస్తామంటూ రోజుకో స్కూల్‌ పుట్టుకొస్తోంది. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. బోధన ఉండదు.. గ్యారేజీ కనిపించదు. కనీస ప్రమాణాలు పాటించడం లేదు. అధికారులొస్తే ఆ కాస్తసేపటికి హడావిడి చేసి పక్కన ఉండే గదులు చూపి వారి కళ్లు కప్పుతున్నారు.  కరోనా తర్వాత కార్ల కొనుగోలు పెరిగింది.

Updated : 27 Sep 2022 05:09 IST

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: డ్రైవింగ్‌ నేర్పిస్తామంటూ రోజుకో స్కూల్‌ పుట్టుకొస్తోంది. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. బోధన ఉండదు.. గ్యారేజీ కనిపించదు. కనీస ప్రమాణాలు పాటించడం లేదు. అధికారులొస్తే ఆ కాస్తసేపటికి హడావిడి చేసి పక్కన ఉండే గదులు చూపి వారి కళ్లు కప్పుతున్నారు.  కరోనా తర్వాత కార్ల కొనుగోలు పెరిగింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్‌ స్కూళ్లు వెలుస్తున్నాయి. జిల్లాలో మొత్తం 42 డ్రైవింగ్‌ స్కూళ్లు ఉన్నాయి. డ్రైవింగ్‌ నేర్పిస్తామని చెప్పి అనధికారికంగా మరెందరో బోర్డులు పెట్టుకుని కార్యకలాపాలు నిర్వహిస్తునారు. ఒక్కో డ్రైవింగ్‌ స్కూల్‌కు ఐదేళ్ల వరకు రవాణా శాఖ అనుమతులు ఇస్తుంది. ఒక వాహనానికి చెప్పి మూడు, నాలుగు వాహనాల్లో డ్రైవింగ్‌ నేర్పిస్తున్నారు. ఐదేళ్లదాకా రెన్యూవల్‌ ప్రసక్తి లేకపోవడంతో డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి.

డ్రైవింగ్‌ స్కూల్‌ వద్ద బయటే ట్రాఫిక్‌ సూచికలు ఉండాలి. ప్రత్యేకంగా గది ఉండాలి. పాఠాలు బోధించడానికి బ్లాక్‌ బోర్డుతో కూడిన తరగతి గది ఉండాలి.వాహనాల పరికరాలతో గ్యారేజీ ఉండాలి.నేర్చుకునేవారి హాజరు పట్టిక తప్పకుండా నిర్వహించాలి.డ్రైవింగ్‌ నేర్పించే వాహనాలకు ‘ఎల్లో’ బోర్డు తప్పకుండా ఉండాలి. 

అనుమతుల్లేకుండానే

నంద్యాల పట్టణంలో కొన్నిచోట్ల డ్రైవింగ్‌ స్కూల్స్‌కు అనుమతులు లేవు. నిర్వాహకుడికి లైసెన్స్‌ ఉంటే అతని బదులు లైసెన్స్‌ లేని వారితో నేర్పిస్తున్నారు. కనీసం ప్రమాణాలైన గ్యారేజీ, తరగతి గదితో పాటు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ కనిపించడం లేదు. ఒకచోట అనుమతులు తీసుకుని రెండు మూడు బ్రాంచీలను నడుపుతున్నారు.‘‘ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని డీటీవో నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని