logo

ఏడాదిన్నరలోపు ఖాళీ చేస్తాం

ఏడాదిన్నరలోపే ఖాళీ చేస్తామనే షరతుతో నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి (ఆర్‌ఏఆర్‌ఎస్‌) చెందిన భవనాల్లో కొత్తగా కలెక్టరేట్‌ ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది

Published : 27 Sep 2022 03:42 IST

- ఆ షరతుతోనే ఆర్‌ఏఆర్‌ఎస్‌ భవనాల్లో కలెక్టరేట్‌

ఈనాడు, కర్నూలు: ఏడాదిన్నరలోపే ఖాళీ చేస్తామనే షరతుతో నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి (ఆర్‌ఏఆర్‌ఎస్‌) చెందిన భవనాల్లో కొత్తగా కలెక్టరేట్‌ ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది బొజ్జా అర్జున్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరిశోధన కేంద్రం భవనంలో కలెక్టరేట్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే అధికారం వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు లేదన్నారు. పప్పుధాన్యాల పరిశోధన కోసం నిర్మిస్తున్న అదనపు భవనం, ఆడిటోరియాలను కలెక్టరేట్‌కు ఇచ్చారన్నారు. అందుకు భిన్నంగా అడ్వాన్స్‌ రీసెర్చ్‌ లెబోరేటరీలో కలెక్టరేట్‌ నడుస్తోందన్నారు. ఇరువైపు వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.    పరిశోధన కేంద్రం భవనాల్లో కలెక్టరేట్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దశరథరామిరెడ్డి, మరో ఇద్దరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని