logo

ఇసుక దందా కోసమే చెరువుల్లో నీరు నింపడం లేదు

వైకాపా నాయకులు ఇసుక దందా కోసమే చెరువుల్లో నీరు నింపడంలేదని నియోజకవర్గం తెదేపా బాధ్యుడు పి.తిక్కారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో రెండు పంటలకు సాగునీరు అందించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. సోమవారం సాయంత్రం రచ్చుమర్రి-సుంకేశ్వరి గ్రామాల మధ్య

Published : 27 Sep 2022 03:42 IST

మూతబడిన బసలదొడ్డి స్టేజ్‌-2 ఎత్తిపోతల పథకం వద్ద తిక్కారెడ్డి

మంత్రాలయం , న్యూస్‌టుడే: వైకాపా నాయకులు ఇసుక దందా కోసమే చెరువుల్లో నీరు నింపడంలేదని నియోజకవర్గం తెదేపా బాధ్యుడు పి.తిక్కారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో రెండు పంటలకు సాగునీరు అందించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. సోమవారం సాయంత్రం రచ్చుమర్రి-సుంకేశ్వరి గ్రామాల మధ్య నిర్మించిన బసలలదొడ్డి చెరువు, స్టేజ్‌-2 ఎత్తిపోతల పథకాలను నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుంగభద్ర నీరు సముద్రంలో కలిసి వృథా అవుతుంటే నీటిని సద్వినియోగం చేసుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందన్నారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు చంద్రబాబు మానసపుత్రిక అని ఆయన అధికారంలోకి వచ్చాక పులికనుమను పూర్తి చేశారన్నారు. నియోజకవర్గంలో చెరువులు, ఎత్తిపోతల పథకాలు నిర్మించి వాటి ద్వారా రెండు పంటలకు సాగునీరు ఇచ్చారన్నారు. ప్రస్తుతం చెరువుల్లో నీరు నింపకుండా ఖాళీగా ఉంచి ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు రమాకాంతరెడ్డి మాట్లాడుతూ ఉన్న ఎత్తిపోతల పథకాలకు నిధులు అక్కర్లేదని కేవలం బటన్‌ నొక్కితే చాలు నీరు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో పల్లెపాడు రామిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, వగరూరు రామిరెడ్డి, చావడి వెంకటేశులు, ఆచారి, వెంకటేశులు, రఘు, చంద్ర, గోపాల్‌రెడ్డి, రోగప్ప పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని