logo

సహకార బ్యాంకును లాభాల బాటలో నడిపిద్దాం

జిల్లా సహకార బ్యాంకు అభివృద్ధికిగాను డిపాజిట్ల సేకరణ, కాసా డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆప్కాబ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.రాజయ్య అన్నారు. రుణాల బట్వాడా, రికవరీపై అశ్రద్ధ చేయకుండా మంచి పురోగతి సాధించేలా బ్యాంకు అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లా

Published : 27 Sep 2022 03:42 IST

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న ఆప్కాబ్‌ సీజీఎం రాజయ్య, బ్యాంకు ఛైర్‌పర్సన్‌ మహాలక్ష్మి,

సీఈవో రామాంజనేయులు, అధికారులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా సహకార బ్యాంకు అభివృద్ధికిగాను డిపాజిట్ల సేకరణ, కాసా డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆప్కాబ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.రాజయ్య అన్నారు. రుణాల బట్వాడా, రికవరీపై అశ్రద్ధ చేయకుండా మంచి పురోగతి సాధించేలా బ్యాంకు అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సోమవారం కర్నూలు, నంద్యాల డీసీసీబీ బ్రాంచి మేనేజర్లతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ 2021-22లో బ్యాంకు సాధించిన ప్రగతిని, అభివృద్ధిని ఇక ముందూ కొనసాగించాలన్నారు. బ్యాంకు వ్యాపార లావాదేవీల మొత్తాన్ని రూ.4 వేల కోట్లకు చేర్చాలని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పురోభివృద్ధికి చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికను డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ ఎస్‌.మహాలక్ష్మి వివరించారు. మహిళా సంఘాలకు రుణాలు విరివిగా మంజూరు చేసి చేయాలని వారు పేర్కొన్నారు. ప్యాక్స్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ మేనేజర్‌ భరద్వాజ శర్మ పలు అంశాలను నివేదించారు.  ‘విజయదుర్గ డిపాజిట్‌’ పథకాన్ని ఛైర్‌పర్సన్‌, ఆప్కాబ్‌ సీజీఎం ఆవిష్కరించారు. సీఈవో పి.రామాంజనేయులు, ఓఎస్‌డీ యం.విజయకుమార్‌, డీఆర్‌ఓఎస్‌డీ కుమారి నాగలింగేశ్వరి దేవి, బ్యాంకు సీనియర్‌ అధికారులు కె.ఉమామహేశ్వరరెడ్డి, బి.సునీల్‌కుమార్‌, బి.వి.నాగిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని