logo

శ్రీగిరి భక్తసిరి

ఇల కైలాసం శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలతో సందడి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో రోజుకో విధంగా పుష్పాలంకరణ చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబాదేవి బుధవారం భక్తులకు చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు.

Updated : 29 Sep 2022 06:11 IST

రావణ వాహనంపై విహరించిన పార్వతీపరమేశ్వరులు

రావణ వాహనంపై విహరిస్తున్న భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి

ఇల కైలాసం శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలతో సందడి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో రోజుకో విధంగా పుష్పాలంకరణ చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబాదేవి బుధవారం భక్తులకు చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై చంద్రఘంటదేవిని కొలువుదీర్చి మంగళహారతులతో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై వేంచేబు చేశారు. పార్వతీ పరమేశ్వరులు అభయహస్త దీవెనలిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తలు విరూపాక్షయ్యస్వామి, మధుసూదన్‌రెడ్డి నారికేళాలు సమర్పించారు. కేరళ కళాకారుల డోలు విన్యాసాలు, శివపార్వతుల వేషధారణలు, తప్పెట చిందు, చెక్కభజన, ఢమరుకం, పిల్లనగ్రోవి, శంఖు నాదాలతో కళాకారులు సందడి చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలో కూచిపూడి నృత్యాలు, భక్తిరంజని కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శ్రీశైలంలో నేడు...: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం సాయంత్రం శ్రీభ్రమరాంబాదేవి కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

- న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని