logo

తండ్రిని హత్య చేసిన తనయుడు సహకరించిన తల్లి

మద్యం మత్తులో కన్న తండ్రినే తనయుడు హతమార్చిన వైనం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కోసిగి సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ ఎరిసావలి, ఎస్సై రాజారెడ్డి ఘటన వివరాలు వెల్లడించారు.

Published : 29 Sep 2022 03:42 IST

నిందితురాలిని చూపుతున్న సీఐ ఎరిసావలి, ఎస్సై రాజారెడ్డి

కోసిగి న్యూస్‌టుడే: మద్యం మత్తులో కన్న తండ్రినే తనయుడు హతమార్చిన వైనం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కోసిగి సర్కిల్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ ఎరిసావలి, ఎస్సై రాజారెడ్డి ఘటన వివరాలు వెల్లడించారు. కోసిగి పట్టణంలోని రెండో వార్డులో నివాసముంటున్న నాగన్నగేరి ఈరయ్యకు భార్య అల్లమ్మ, మైనర్‌ కుమారుడు ఉన్నారు. ఈ నెల 25న ఈరయ్యను గొడ్డలితో దారుణంగా హత మార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించారు. మృతుడు ఈరయ్య మద్యానికి బానిసై భార్య, కుమారుడితో నిత్యం గొడవపడుతున్నారు. మైనర్‌ అయిన కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై తిరుగుతుండడంతో ఈరయ్య హెచ్చరించాడు. ఈ విషయంలో పలుమార్లు కుటుంబ వివాదాలు సాగాయి. వారం రోజుల కిందట కుమారుడిని కొట్టడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి గొడవపడి ఈరయ్య తన భార్యను బయటకు పంపాడు. ఇంటికి వచ్చిన కుమారుడు తల్లి అల్లమ్మ నాగన్నకట్ట వద్ద నిద్రిస్తుండడం చూసి  బయట ఎందుకు పడుకున్నావంటూ అడిగాడు. తండ్రి బయటికి పంపాడని చెప్పడంతో ఆవేశంతో ఇంట్లోకి వెళ్లి ఈరయ్యను గొడ్డలితో నరికాడు. ఈరయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దారుణానికి భార్య అల్లమ్మ సహకరించినట్లు విచారణలో తేలడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని