logo

సీమ నుంచే వైకాపా ఓటమి ప్రారంభమవ్వాలి : అఖిలప్రియ

వైకాపా ఓటమి రాయలసీమ నుంచే ప్రారంభం కావాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని తన నివాసంలో బుధవారం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో కలిసి ఆమె నాయకులు,

Updated : 29 Sep 2022 06:14 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : వైకాపా ఓటమి రాయలసీమ నుంచే ప్రారంభం కావాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని తన నివాసంలో బుధవారం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో కలిసి ఆమె నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో సీమ వాసులకు వైకాపాను ఓడించే అవకాశం వచ్చిందన్నారు. తనకు 151 సీట్లు ఇచ్చిన ప్రజలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇష్టానుసారం పన్నులు పెంచుతూ అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు బుద్ధిచెప్పాలన్నారు. పట్టభద్రులందరితో ఓటు నమోదు చేయించేందుకు తెదేపా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటు నమోదుకు అక్టోబరు 1 నుంచి నవంబరు 7వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించాలన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌, పార్లమెంటు తెదేపా ఉపాధ్యక్షులు శివశంకర్‌ యాదగిరి, రవీంద్ర, ఉపాధ్యాయులు, పట్టభద్రులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని