logo

వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీకి అదే పేరు కొనసాగించాలని నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

Published : 30 Sep 2022 01:37 IST

మాట్లాడుతున్న నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి.. దీక్షలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు

ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీకి అదే పేరు కొనసాగించాలని నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును ముఖ్యమంత్రి కుట్రపూరితంగా తొలగించడాన్ని నిరసిస్తూ గురువారం కల్లూరు చెన్నమ్మ కూడలిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం నిధులను కాజేశారని ఆరోపించారు. పాణ్యం నియోజకవర్గంలో ప్రభుత్వ, వక్ఫ్‌ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో వైకాపాకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు కొనసాగించాలంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు పట్టణ, గ్రామీణ, ఓర్వకల్లు మండలాలకు చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.-న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts