logo

కైలాస వాహనంపై ఆదిదంపతులు

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల పుష్పాలతో అలంకరించారు.

Updated : 30 Sep 2022 06:38 IST

కైలాస వాహనంపై కొలువైన ఆదిదంపతులు

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. నవరాత్రుల్లో నాలుగో రోజు గురువారం శ్రీశైలభ్రమరాంబ దేవి కూష్మాండదుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వామిఅమ్మవార్ల అర్చకులు వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. కైలాసవాహనంపై ఆదిదేవులు కొలువుదీరారు.   ఈ సందర్భంగా కళాకారుల విన్యాసాలు భక్తులను అలరించాయి.
నేటి కార్యక్రమాలు
శ్రీశైలమహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం శ్రీశైలభ్రమరాంబ దేవి స్కందమాత అలంకారంలో శేషవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. - న్యూస్‌టుడే, శ్రీశైలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని