logo

ఒత్తిడితో గుండె జబ్బులు అధికం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ఒత్తిడితో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉందని, యోగా, ధ్యానం, వ్యాయామం, నడకతో దీని బారిన పడకుండా నివారించవచ్చని కర్నూలు సర్వజన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

Published : 30 Sep 2022 01:37 IST

సదస్సులో మాట్లాడుతున్న ఆసుపత్రి  పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ఒత్తిడితో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉందని, యోగా, ధ్యానం, వ్యాయామం, నడకతో దీని బారిన పడకుండా నివారించవచ్చని కర్నూలు సర్వజన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్డియాలజీ విభాగంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.  ఆకుకూరలు, పండ్లు, నిత్యం నడక చేయడం, ధూమపానం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. వైద్యులు వెంకటేశ్వర్లు, ఆనంద్‌యాదవ్‌ పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకుమారి, జనరల్‌ మెడిసిన్‌  విభాగాధిపతి డాక్టర్‌ శ్రీరాములు, పీడియాట్రిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవికుమార్‌,  పీజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని