logo

దారి కథ.. రైతు వ్యథ

అన్నదాతలు పొలాలకు వెళ్లాలన్నా.. పల్లెలకు చేరాలన్నా.. అష్టకష్టాలు పడక తప్పడం లేదు. మద్దికెర, అగ్రహారం, యడవలి, బొజ్జనాయునిపేట తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులకు వేలాది ఎకరాల పొలాలు ఈ దారిలోనే ఉన్నాయి.

Published : 30 Sep 2022 01:37 IST

మద్దికెర నుంచి మొలగవల్లి, నేమకల్లు దారిలో పొలాలకు వెళ్లే మార్గం ఇదే

అన్నదాతలు పొలాలకు వెళ్లాలన్నా.. పల్లెలకు చేరాలన్నా.. అష్టకష్టాలు పడక తప్పడం లేదు. మద్దికెర, అగ్రహారం, యడవలి, బొజ్జనాయునిపేట తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులకు వేలాది ఎకరాల పొలాలు ఈ దారిలోనే ఉన్నాయి. ఎంతో కాలంగా ఈ దారిలో రాకపోకలు సాగించేందుకు రైతులతో పాటు, ఇదే దారిలో ఉన్న ఆలూరు, మొలగవల్లి, నేమకల్లు తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్దికెర సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ కింద గతంలో నిర్మించిన వంతెన కిందే రాకపోకలు సాగించాలి. అయితే ఆ వంతెన కేవలం వర్షం నీరు పారేందుకు మాత్రమే నిర్మించామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ దారి మాత్రమే మాకు పొలాలకు వెళ్లే ప్రధాన రహదారి అని ఈ ప్రాంత రైతులు, ప్రజలు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే ప్రాంతంలో రాకపోకల కోసం మరో వంతెన నిర్మించాలని పెద్దఎత్తున ఆందోళన చేపట్టినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. రైల్వే అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో అన్నదాతలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇరుకుగా ఉన్న ఈ వంతెనలో రైతులు వెళ్లడం ఇబ్బందే. ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతూ ఈ ప్రాంత రైతులు ఏటా కష్టాలు పడుతూనే ఉన్నా అధికారులు కొత్త వంతెన నిర్మాణ విషయమై స్పష్టత ఇవ్వడం లేదు. మా పరిధిలో లేదని తప్పించుకుంటున్నారు.
* ఈ విషయాన్ని రైల్వే డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ వరుణ్‌బాబుతో ప్రస్తావించగా.. రైతుల ఇబ్బందులు గుర్తించి మరో వంతెన ద్వారా రహదారి నిర్మిస్తామని చెప్పాం. రైతులు వర్షం నీరు పారేందుకు ఏర్పాటు చేసిన ఈ వంతెన సమీపంలోనే కొత్తది నిర్మించాలని కోరారు. అది మా పరిధిలో లేదు. కొత్తది నిర్మించాలని రైతులు కోరారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. 

- న్యూస్‌టుడే, పత్తికొండ 

వర్షం పడితే అడుగేయడం కష్టమే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని