logo

పీడీ చట్టం నమోదు చేస్తాం

అక్రమ మద్యం వ్యాపారం కొనసాగిస్తూ నేర వృత్తిని వదలకపోతే పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కృష్ణకాంత్‌ పటేల్‌ హెచ్చరించారు.

Published : 30 Sep 2022 01:37 IST

ఓర్వకల్లు మండల పరిధిలోని తండాలో మాట్లాడుతున్న సెబ్‌ జేడీ కృష్ణకాంత్‌ పటేల్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : అక్రమ మద్యం వ్యాపారం కొనసాగిస్తూ నేర వృత్తిని వదలకపోతే పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కృష్ణకాంత్‌ పటేల్‌ హెచ్చరించారు. ఆయన గురువారం మాట్లాడుతూ ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా సారా నిరూల్మనకు సెబ్‌, పోలీసు శాఖలు కృషి చేస్తున్నాయని, 21 సారా ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహించిన దాడుల్లో 17 మందిని అరెస్టు చేసి 150 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 15 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు సారా కేసుల నిందితులను బైండోవర్‌ చేశామన్నారు. షరతులు ఉల్లంఘించిన ఒకరికి రూ.15 వేల జరిమానా విధించామన్నారు. అక్రమ మద్యానికి సంబంధించి 116 మందిని అరెస్టు చేసి 1,194 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని 65 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని