logo

విజయ డెయిరీ ఆదాయం రూ.211 కోట్లు

విజయ డెయిరీ 2021-22కి రూ.211 కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు కర్నూలు పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్‌.వి.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం నంద్యాలలోని విజయ డెయిరీలో కర్నూలు జిల్లా పాలఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి లిమిటెట్‌ 34వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Published : 30 Sep 2022 01:37 IST

మాట్లాడుతున్న కర్నూలు పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్‌.వి.జగన్‌మోహన్‌రెడ్డి

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: విజయ డెయిరీ 2021-22కి రూ.211 కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు కర్నూలు పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్‌.వి.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం నంద్యాలలోని విజయ డెయిరీలో కర్నూలు జిల్లా పాలఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి లిమిటెట్‌ 34వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2021-22కి 213 లక్షల లీటర్ల పాల సేకరణ జరిపి 298 లక్షల లీటర్ల పాలను విక్రయించామన్నారు. 2023-24కి 257 లక్షల లీటర్ల పాలసేకరణ చేసి 383 లక్షల లీటర్ల పాల అమ్మకాలను జరపాలని లక్ష్యం నిర్ణయించుకున్నామన్నారు. పాడి రైతులకు పశుగ్రాస క్షేత్రాలు, కల్యాణమస్తు పథకం, ఇతర సాంకేతిక వనరులకు 2021-22కి రూ.61.40 లక్షలను ఖర్చు చేశామని, 2023-24కి రూ.156.17 లక్షలను కేటాయించామన్నారు. విజయ డెయిరీ అందిస్తున్న సంక్షేమ పథకాలను, సాంకేతిక వనరులను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసి అధిక ఆదాయాన్ని పొందాలన్నారు. ప్రస్తుతం కల్పిస్తున్న సౌకర్యాలకు అదనంగా పాడిపశువుల కొనుగోలుపై 20 శాతం రాయితీతో రుణం అందజేస్తున్నామన్నారు. పాడి రైతుల కుటుంబాలకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి క్షీరబంధు పథకం ద్వారా తక్షణసాయం కింద రూ.50 వేలు అందించేందుకు తీర్మానం చేశామన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ పరమేశ్వరరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ రాజేష్‌, ప్రొడక్షన్‌ అధికారులు వెంకటేశ్వర్లు, విశ్వనాధ్‌, విజయకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని