logo

కోవెలకుంట్లలో భారీ వర్షం

జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తపల్లి, పాములపాడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం పడింది. కోవెలకుంట్లలో 10.6, ఆళ్లగడ్డలో 10.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.

Published : 30 Sep 2022 01:37 IST

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తపల్లి, పాములపాడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం పడింది. కోవెలకుంట్లలో 10.6, ఆళ్లగడ్డలో 10.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. శ్రీశైలంలో 98.4 మి.మీ.లు, బనగానపల్లి 68.2, దొర్నిపాడు 65.8, నంద్యాల 54.4, ఉయ్యాలవాడ 50.2, సంజామల 47.4, చాగలమర్రి 46.8, గడివేముల 38.2, బేతంచెర్లలో 32.8 మి.మీ.లుగా నమోదైంది. నందికొట్కూరు 30.4, అవుకు 28.2, డోన్‌ 25.2, మహానంది 24.2, బండి ఆత్మకూరు 22.4, కొలిమిగుండ్ల 16.4, వెలుగోడు 15.8, పాణ్యం 12.2, జూపాడుబంగ్లా 9.6, గోస్పాడు 9.4, పగిడ్యాల 8.4, మిడుతూరు 7.2, ఆత్మకూరు 4.4, రుద్రవరం, శిరువెళ్ల, ప్యాపిలిలో 1.4 మి.మీ.లు పడింది.  ప్రస్తుతం పడుతున్న వర్షాలకు వరి, పత్తి, కంది తదితర పంటలకు మేలని.. కోతకు వచ్చిన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని, వర్షాలు ఇలాగే కొన్ని రోజుల పాటు కొనసాగితే పంటలకు తెగుళ్లు సోకే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
కోవెలకుంట్లలో 10 సెం.మీ వర్షం కురవడంతో అమ్మవారిశాల, నాగులకట్ట, చాకలివీధి, మారెమ్మ గుడి సమీపంలోని ఎస్సీ కాలనీ, స్వామినగర్‌ కాలనీల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని