logo

తీరొక్క పూలు.. వేవేల దండాలు

శ్రీశైలంలో నేడు.. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు గజ వాహనసేవ జరగనుంది.

Updated : 02 Oct 2022 04:54 IST

పుష్ప పల్లకిలో ఆదిదంపతుల విహారం

శ్రీశైలంలో నేడు.. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు గజ వాహనసేవ జరగనుంది.

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఆరోరోజు శనివారం భ్రమరాంబాదేవి కాత్యాయనిగా కొలువుదీరి పూజలందుకున్నారు. అక్కమహాదేవి అలంకార మండపంలో హంస వాహనంపై ఆశీనులైన పార్వతీ పరమేశ్వరులకు ఉభయ దేవాలయాల అర్చకులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తలు స్వామి, అమ్మవార్లకు నారికేళాలు సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వెలుపలికి తీసుకొచ్చారు. రథశాల వద్ద నేత్రశోభితంగా అలంకరించిన పుష్పపల్లకిలో కాత్యాయని అమ్మవారిని అధిష్ఠింపజేసి పూజించారు. పురవీధుల్లోకి పుష్పపల్లకి కదలి వస్తుండగా.. జానపద కళాకారులు ఢమరుక, శంఖునాదాలతో సందడి చేశారు. ఉత్సవం ఎదుట తప్పెట చిందు, కాళికా నృత్య వేషధారణలు, మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని