logo

పెద్దలను గౌరవించడం అందరి బాధ్యత

ఉన్నత విలువలు.. సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన మన సమాజంలో పెద్దలను గౌరవించడం మనందరి బాధ్యత అని, వయో వృద్ధుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌ కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని

Published : 02 Oct 2022 01:56 IST

వృద్ధురాలికి చేతి కర్ర అందజేస్తున్న ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఉన్నత విలువలు.. సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన మన సమాజంలో పెద్దలను గౌరవించడం మనందరి బాధ్యత అని, వయో వృద్ధుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌ కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మారుతున్న ప్రపంచంలో.. వృద్ధుల స్థితిస్థాపకత’ నినాదంతో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీనియర్‌ సిటిజన్ల  సంక్షేమ కార్యకలాపాలను పట్టణాలకే పరిమితం చేయకుండా ఏటా కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని అక్కడ ఉన్నవారిపై దృష్టి సారించాలన్నారు.  కార్మికులకు సంబంధించి 30 పడకలతో కూడిన ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరైందన్నారు. వయో వృద్ధుల సంక్షేమం కోసం సొంత భవన నిర్మాణానికి ఐదు లేక పది సెంట్ల ప్రభుత్వ స్థలం ఇచ్చేలా చూస్తామని, ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా రూ.50 లక్షలు లేదా రూ.కోటి మంజూరు చేస్తామన్నారు. వృద్ధులు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉండాలని డీఆర్వో నాగేశ్వరరావు అన్నారు.  విపత్తు నిర్వహణాధికారిణి అనుపమ, మైనార్టీ సంక్షేమాధికారి మహబూబ్‌బాషా, కేవీఆర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఇందిరా శాంతి, టూరిజం మేనేజర్‌ వెంకటేశ్వర్లు, డీఎస్‌వో రాజా రఘువీర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని