logo

ఫిర్యాదులపై అలసత్వం వీడండి

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై అలసత్వం వహించరాదని కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి, ఆళ్లగడ్డ డీఎస్పీ

Published : 02 Oct 2022 01:56 IST

కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌ కుమార్‌

వందనం స్వీకరిస్తున్న డీఐజీ సెంథిల్‌కుమార్‌

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై అలసత్వం వహించరాదని కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి, ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకట్రామయ్య పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా, ఎస్సై నరసింహులు గౌరవ వందనం చేశారు. అనంతరం డీఐజీ పోలీస్‌స్టేషన్‌లో దస్త్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణతోపాటు మహిళలపై జరుగుతున్న నేరాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి అక్కడ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలన్నారు.   ఈ కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్‌రెడ్డి, జీవన్‌బాబు, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని