logo

ఆటోలో అపాయం

నంద్యాల పట్టణంలో ట్రాఫిక్‌పై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో రహదారి నిబంధనలు పాటించే వారు కరవయ్యారు. వాహనదారులు ఎవరికివారు ఇష్టానుసారం దూసుకెళుతున్నారు. రద్దీ మార్గాల్లో ప్రమాదకర వస్తువులను ఎలాంటి జాగ్రత్తల్లేకుండానే తరలిస్తున్నారు.

Published : 02 Oct 2022 01:56 IST

నంద్యాల పట్టణంలో ట్రాఫిక్‌పై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో రహదారి నిబంధనలు పాటించే వారు కరవయ్యారు. వాహనదారులు ఎవరికివారు ఇష్టానుసారం దూసుకెళుతున్నారు. రద్దీ మార్గాల్లో ప్రమాదకర వస్తువులను ఎలాంటి జాగ్రత్తల్లేకుండానే తరలిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే సంజీవనగర్‌ నుంచి శ్రీనివాస సెంటర్‌కి వెళ్లే దారిలో శనివారం ఓ ఆటోలో ఇనుప రేకులు, వస్తువులను ప్రమాదకరంగా తరలించారు. ఎలాంటి రక్షణ జాగ్రత్తలు లేకుండా పదునైన సామగ్రిని తరలించడం వల్ల ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని మిగతా వాహనదారులు భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. వీటి కట్టడికి ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, నంద్యాల గాంధీచౌక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని