logo

కాల్వలు లేక అవస్థలు పడుతున్నాం

‘దారంతా మురుగుమయంగా మారింది. రోజూ రాకపోకలు కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. కాల్వలు వేయించి మా అవస్థలు తీర్చాలని’ ఆలూరు మండలం కురవళ్లి ఎస్సీ కాలనీవాసులు మంత్రికి విన్నవించారు. ఆలూరు మండలంలోని కురవళ్లి గ్రామంలో

Published : 02 Oct 2022 01:56 IST

మంత్రికి సమస్య చూపుతున్న ఎస్సీ కాలనీవాసులు

ఆలూరు, న్యూస్‌టుడే: ‘దారంతా మురుగుమయంగా మారింది. రోజూ రాకపోకలు కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. కాల్వలు వేయించి మా అవస్థలు తీర్చాలని’ ఆలూరు మండలం కురవళ్లి ఎస్సీ కాలనీవాసులు మంత్రికి విన్నవించారు. ఆలూరు మండలంలోని కురవళ్లి గ్రామంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు నిల్వ ఉన్న మురుగును ఆయనకు చూపించారు. కాల్వలు లేకపోవడంతో వర్షం నీటితోపాటు మురుగంతా రోడ్డుపైనే నిలిచిపోతుందని వివరించారు. స్పందించిన మంత్రి వెంటనే కాలనీలో మురుగుకాల్వలు ఏర్పాటు చేయించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఏరూరు శేఖర్‌, ఎంపీపీ శ్రీరాములు, సర్పంచి రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని