logo

దిగుబడుల శుభ్రతకు యంత్రం

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తెస్తే శుభ్రంగా లేవని, చెత్తా చెదారం కలిసిందని కొర్రీలు వేస్తూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారు. స్పందించిన ప్రభుత్వం దిగుబడుల శుభ్రత, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసేందుకు కోట్ల రూపాయలతో యంత్రాలు ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది.

Updated : 02 Oct 2022 04:59 IST

రూ.1.54 కోట్లతో కర్నూలు,  ఆదోని, ఎమ్మిగనూరులో ఏర్పాటు

వేరుసెనగ దిగబడులు

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తెస్తే శుభ్రంగా లేవని, చెత్తా చెదారం కలిసిందని కొర్రీలు వేస్తూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారు. స్పందించిన ప్రభుత్వం దిగుబడుల శుభ్రత, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసేందుకు కోట్ల రూపాయలతో యంత్రాలు ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది. కర్నూలు, ఆదోని ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో నాబార్డు కింద శుభ్రపరిచే యంత్రాలను ఏర్పాటు చేసేందుకు రూ.1.54 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇటీవల టెండర్లు పిలవడంతో కిర్ప ఆగ్రో ఇండస్ట్రీస్‌ సంస్థ పనులను దక్కించుకుంది. త్వరలో వీరు యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు వేరుసెనగ, ఆముదం, శనగ, కందులు, పొద్దుతిరుగుడు దిగుబడులను రైతులు మార్కెట్‌ యార్డులో విక్రయించేందుకు తెస్తే చెత్తా చెదారం ఉందని వ్యాపారులు ధర తగ్గించి కొన్నారు. ఇపుడు యంత్రాలు ఏర్పాటుచేస్తే దిగుబడులను నామమాత్ర రుసుముతో శుభ్రపరిచి ఇవ్వనున్నారు. దీంతో నాణ్యత పెరిగి మంచి దిగుబడి లభించనుంది. యంత్రాలను త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని కార్యదర్శి ఉమాపతిరెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని