logo

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యమొద్దు

సీమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని..పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని రాయలసీమ విద్యావంతుల వేదిక కర్నూలు జిల్లా సహ కన్వీనర్‌ భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం

Published : 02 Oct 2022 01:56 IST

నిరసన తెలుపుతున్న రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు

కర్నూలు (వెంకటరమణ కాలనీ), కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే: సీమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని..పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని రాయలసీమ విద్యావంతుల వేదిక కర్నూలు జిల్లా సహ కన్వీనర్‌ భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1వ తేదీ బదులు అక్టోబరు 1వ తేదీన జరపాలని డిమాండ్‌ చేశారు. వేదవతి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తే పశ్చిమ ప్రాంతంలో వలసలు, కరవు ఉండదని తెలిపారు. ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణం, సిద్ధేశ్వరం రిజర్వాయర్‌ పనులు చేపట్టాలన్నారు. రాయలసీమలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వీపీఎస్‌ నాయకులు రవికుమార్‌, సీమకృష్ణ, మోహన్‌, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు  వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు