logo

కిడ్నీ బాధితురాలికి రూ.లక్ష ఆర్థికసాయం

‘పేదింటికి పెద్ద కష్టం’ శీర్షికతో సెప్టెంబరు 28న ఈనాడులో వచ్చిన కథనానికి పలువురు దాతలు స్పందించారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు ఆదివారం బాధితురాలికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Published : 03 Oct 2022 01:51 IST

బాధితురాలికి నగదు అందజేస్తున్న చేయూత సంస్థ సభ్యులు, దాతలు

డోన్‌, న్యూస్‌టుడే: ‘పేదింటికి పెద్ద కష్టం’ శీర్షికతో సెప్టెంబరు 28న ఈనాడులో వచ్చిన కథనానికి పలువురు దాతలు స్పందించారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు ఆదివారం బాధితురాలికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. పట్టణంలోని కొండపేటకు చెందిన గోవర్దన్‌ భార్య మంజుల కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించాలని వైద్యులు సూచించటంతో అందుకు మందుల ఖర్చుల కోసం రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పలువురు దాతలు స్పందించారు. సామాజిక మాధ్యమాల్లోనూ బాధితురాలి విషయం తెలుసుకున్న కొందరు దాతలు ఆర్థిక సాయం అందించినట్లు సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు బంగారు దుకాణం మనోహర్‌, శ్రీనివాసులు, వెంకటేశ్‌, రవికుమార్‌, బాషా, రాజశేఖర్‌, చంద్రశేఖర్‌, దేవరాజు, జయన్న, మోహన్‌, రామాంజనేయులు, నూర్‌బాషా, మధు, హరి, అశోక్‌ పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts