logo

విచారణకు తీసుకొచ్చి.. కేసు నమోదు చేస్తారా

ఓ మహిళ ఆలూరులోని ఆస్పత్రిలో ఆవరణలో పెట్రోలు పోసుకుని హల్‌చల్‌ చేశారు. సారా, మద్యం అమ్ముతున్నామని మా కుటుంబ సభ్యులను సెబ్‌, పోలీసులు వేధించి కేసులు నమోదు చేస్తున్నారని నిందితుల కుటుంబ సభ్యుల్లో ఒకరు పెట్రోలు పోసుకోగా..

Updated : 03 Oct 2022 05:39 IST

నిందితుడి భార్య ఆత్మహత్యాయత్నం


మహిళ నుంచి పెట్రోలు సీసాను లాక్కుంటున్న సెబ్‌ ఎస్సై, సిబ్బంది

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఓ మహిళ ఆలూరులోని ఆస్పత్రిలో ఆవరణలో పెట్రోలు పోసుకుని హల్‌చల్‌ చేశారు. సారా, మద్యం అమ్ముతున్నామని మా కుటుంబ సభ్యులను సెబ్‌, పోలీసులు వేధించి కేసులు నమోదు చేస్తున్నారని నిందితుల కుటుంబ సభ్యుల్లో ఒకరు పెట్రోలు పోసుకోగా.. మరొకరు పురుగు మందుడబ్బా తెచ్చుకుని హల్‌చల్‌ చేసిన సంఘటన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం చోటు చేసుకుంది. హొళగుంద మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఒకరిని సెబ్‌ పోలీసులు, మరో ఇద్దరిని హొళగుంద పోలీసులు తెల్లవారుజామున వచ్చి విచారణ పేరుతో తీసుకెళ్లారు. మల్లయ్య అనే వ్యక్తిని ఆలూరు సెబ్‌ పోలీసులు తీసుకొచ్చి వారిచేత సంతకాలు చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, నిందితుడు మల్లయ్య భార్య రత్నమ్మ, ఆయన అన్న భార్య ఉమాదేవి సెబ్‌ స్టేషన్‌కు వచ్చారు. మల్లయ్యపై కేసు నమోదు చేశారని.. రిమాండ్‌కు తరలించేందుకు వైద్యుల దగ్గర ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారని తెలుసుకున్న వారు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన మల్లయ్య భార్య రత్నమ్మ వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకున్నారు.  నిందితుడి వదిన ఉమాదేవి పురుగుల మందు డబ్బాను తీసుకుని తాగే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న సెబ్‌ ఎస్సై రాజశేఖర్‌ వారిని వారించి సీఐ దగ్గరికి తీసుకెళ్లారు.  ‘మాకు పెద్దపండగ దేవరగట్టు.. ఇంట్లో ఉన్న మగ దిక్కును జైలుకు తీసుకెళ్తే  పండగ ఎలా చేసుకునేది. ఇంట్లో ఉన్న వ్యక్తులపై కేసులు ఎలా పెడతారు’ అని వారు ప్రశ్నించారు. ఈ విషయమై ఆలూరు సెబ్‌ ఎస్సై రాజశేఖర్‌తో ప్రస్తావించగా.. వారు మద్యం విక్రయాలు చేస్తున్నారని, నిరంతరం నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో పట్టుకుని కేసులు నమోదు చేశామని తెలిపారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts