logo

అలరించేందుకు రెఢీ

కళలంటే మక్కువ. నృత్యం అంటే ప్రాణం. డ్యాన్స్‌లో రాణించి వెండితెరపై మెరవాలన్న పట్టుదలతో నిత్యం సాధన చేస్తూ తనకంటూ ప్రత్యేకతను సాధించాడు. తన ప్రతిభను నిరూపించుకుని వివిధ టీవీ కార్యక్రమాల్లో విజయాలు సాధించి..

Published : 03 Oct 2022 01:51 IST

నృత్యంలో రాణిస్తున్న నంద్యాల యువకుడు


జానీ మాస్టర్‌తో..

నంద్యాల గాంధీచౌక్‌, న్యూస్‌టుడే : కళలంటే మక్కువ. నృత్యం అంటే ప్రాణం. డ్యాన్స్‌లో రాణించి వెండితెరపై మెరవాలన్న పట్టుదలతో నిత్యం సాధన చేస్తూ తనకంటూ ప్రత్యేకతను సాధించాడు. తన ప్రతిభను నిరూపించుకుని వివిధ టీవీ కార్యక్రమాల్లో విజయాలు సాధించి.. సినిమాలకు సైతం అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూ గుర్తింపు పొందాడు నంద్యాల యువకుడు  రాజ్‌కుమార్‌.

* నంద్యాల పట్టణం హనీఫ్‌ నగర్‌కు చెందిన బెన్నయ్య, జయమ్మ దంపతుల కుమారుడు రాజ్‌కుమార్‌ డిప్లొమా చదివాడు. అనంతరం సినిమాలపై మక్కువతో నృత్యాన్ని నేర్చుకున్నాడు. గత పదేళ్లుగా నృత్య రంగంలో కొనసాగుతున్నాడు. గతంలో నంద్యాల పట్టణంలో నృత్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురికి శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నృత్య దర్శకులు యూసుఫ్‌, శేఖర్‌ మాస్టర్‌ల దగ్గర సహాయ దర్శకునిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు టీవీ షోలు, చిత్రాల్లో నృత్యం చేసి.. సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేసి గుర్తింపు పొందాడు.

చేసిన టీవీ కార్యక్రమాలు..
ఢీ జూనియర్స్‌-1, ఢీ జూనియర్స్‌-2, ఢీ-10, ఢీ జోడి 11, ఢీ-14 తదితర వాటిల్లో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.


డ్యాన్సర్‌గా చేసిన చిత్రాలు

చిరంజీవి నటించిన ఆచార్య, పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లానాయక్‌, కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన జేమ్స్‌, నితిన్‌ నటించిన మాచర్ల నియోజకవర్గం, శర్వానంద్‌ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో పాటు, ది వారియర్‌, పాగల్‌, పుష్ప, హీరో, రౌడీబాయ్స్‌, రంగ్‌ దే, థాంక్యూ, గ్యాంగ్‌స్టర్‌ గంగరాజుతో పాటు త్వరలో విడుదల కాబోతున్న చిరంజీవి భోళా శంకర్‌, రామ్‌చరణ్ 15వ చిత్రం, బాలకృష్ణ 107వ సినిమా, రవితేజ ధమాకా తదితర చిత్రాలలో బృంద నృత్యంలో పాల్పంచుకున్నాడు.


హీరోగా నటించడమే లక్ష్యం - రాజ్‌కుమార్‌

మా నాన్న ఆర్టీసీ ఉద్యోగి. తల్లి గృహిణి. చిన్నతనం నుంచే నాకు సినిమాలంటే ప్రాణం. దీంతో నటనతో పాటు నృత్యాన్ని నేర్చుకున్నా. ప్రస్తుతం పలు చిత్రాలకు నృత్య సహాయ దర్శకునిగా పనిచేస్తున్నాను. ఎప్పటికైనా హీరోగా నటించాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నా.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts