logo

ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయాం

పంచాయతీలకు చిల్లిగవ్వ కేటాయించకపోవడంతో ప్రజా సమస్యలు పరిష్కరించలేని దుర్భర పరిస్థితిలో కొనసాగుతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు సమకూర్చాలని కోరుతూ ఆలూరు, మొలగవల్లి, పెద్దహోతూరు గ్రామ సర్పంచులు అరుణాదేవి, మోహన్‌రాజు,

Published : 03 Oct 2022 01:51 IST

సర్పంచుల ఆవేదన


నిరసన తెలుపుతున్న సర్పంచులు

ఆలూరు, న్యూస్‌టుడే: పంచాయతీలకు చిల్లిగవ్వ కేటాయించకపోవడంతో ప్రజా సమస్యలు పరిష్కరించలేని దుర్భర పరిస్థితిలో కొనసాగుతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు సమకూర్చాలని కోరుతూ ఆలూరు, మొలగవల్లి, పెద్దహోతూరు గ్రామ సర్పంచులు అరుణాదేవి, మోహన్‌రాజు, లక్ష్మన్నలు ఆలూరులోని అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆదివారం నోటికి వస్త్రం కట్టుకొని నిరసన తెలిపారు. పంచాయతీల్లో ఉన్న కాస్తో కూస్తో నిధులను ప్రభుత్వం వెనక్కి తీసేసుకోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేసేందుకు వీలు లేకుండా పోయిందని వాపోయారు. నిధులు ఇవ్వకుంటే ఇక సర్పంచులుగా ఉండటం ఎందుకని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయామని చెప్పారు. ప్రజలు తమపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అంతకుముందు గాంధీ చిత్రపటం, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని